పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం పాటు పడుతున్న బిఆర్ఎస్ నాయకులు.
బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు తథ్యం
తేజ న్యూస్ టివి ప్రతినిధి,సంగెం.
సంగెం మండల కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కొరకై ప్రచార నేపథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టబద్రుల ఇన్చార్జిలు కత్తెరపల్లి దామోదర్, యార బాలకృష్ణ ,జున్న రాజు, తదితరులు మాట్లాడుతూ బిట్స్ పిలానీ లో విదభ్యాసం పూర్తి చేసి అమెరికాలో ఉన్నత ఉద్యోగం ఉంది ఏడు సంవత్సరాల పాటు పని చేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ ధ్యేయంగా ఎమ్మెల్సీ బరిలో ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టబద్రులుగా మనమంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు పట్టబద్రుల సమస్యలపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డిని గెలిపించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా కోరడం జరిగింది,కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పల్లి బఠానీ బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నకి అలియాస్ (చింతపండు నవీన్) ఓటు వేయవద్దని కోరారు.ఎందుకంటే 56 కేసుల్లో నేర చరిత్ర కలిగి ఉన్న ఒక క్రిమినల్ తీన్మార్ మల్లన్న అని అలాంటి వ్యక్తికి ఓటు వేసి వృధా చేసుకోవద్దని అన్నారు . ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అదినేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తున్నామని సభలలో చెబుతుంటే… ఇంకోపక్క నిండు అసెంబ్లీలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి లేదు అని గా చెప్పడం సిగ్గు చేటు అని. అసలు నిరుద్యోగ భృతి ఉన్నదా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులను ఓటు అడగాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగెం మాజీ సర్పంచ్ గుండేటి బాబు పట్టభద్రుల క్లస్టర్ ఇన్చార్జీలు పెండ్లి పురుషోత్తం రెడ్డి మునుకుంట్ల చంద్రశేఖర్ బొమ్మల శంకర్ చిర్రా రాజకుమార్,యర రంజిత్ కుమార్ కాగితాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.