ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణం లోని నెహ్రూ సెంటర్ నందు జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయం ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం లోని పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోండి. పట్టభద్రుల ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నవంబర్ 6 వ తేదీ లోపు ప్రతి ఒక్కరు తప్పక ఓటు నమోదు చేసుకోవాలని రమాదేవి సూచించారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పరిధిలోని కంచికచర్ల పట్టణ నెహ్రూ సెంటర్ నందు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని జనసేన నాయకులతో కలిసి మంగళవారం చేపట్టారు. తొలుత జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన శిబిరం నందు ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్తగా ఓటరుగా అర్హతలు పొందిన పట్టభద్రుల ఓట్లను నమోదు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని ఆమె తెలియజేయడం జరిగినది. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తంబళ్లపల్లి రమాదేవి తెలిపారు. గత ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లే నేడు కూడా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థినీ తమ అమూల్యమైన ఓట్లు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను తంబళ్ళపల్లి రమాదేవి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాయిని సతీష్, తోట ఓంకార్, దేవి రెడ్డి శ్రీనివాసరావు, ఖమ్మంపాటి రమాదేవి, తిరుమలరావు, ముత్యాల రోజారమణి, బండారుపల్లి సత్యనారాయణ, పసుపులేటి గోపి, దేవేంద్ర, కొమ్మ నరేష్, బత్తుల కృష్ణ, నరసింహారావు, వేణు నాగలక్ష్మి, పద్మారావు, నగరికంటి ప్రభాకర్ రావు మరియు జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES