భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
అశ్వాపురం మండలం
ది.24.01.2025
రాష్ట్రంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలను అయోమయం స్థితిలో పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం….మార్పు దిశగా ప్రయాణించి ఓటేసిన ప్రజలను మళ్లీ మోసబుచ్చిన ప్రభుత్వం. ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ చేయూత పథకం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, రైతు భరోసా కోసం ఎదురుచూసిన ప్రజలకు మళ్లీ నిరాశ ఎదురయింది. అర్హుల లిస్టులు గ్రామ సభల్లో చదివి మళ్లీ ఫైనల్ గా లబ్ధిదారుల లిస్టులు తయారు చేస్తామని చెప్పటం దేనికి నిదర్శనమన్నారు. గతంలో కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మభ్యపరచి ఎన్నికలలో గట్టెక్కి ఈరోజు వరకు కూడా అరగారంటీ కూడా అమలు చేయకుండా, మళ్లీ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందటానికి గ్రామ సభల పేరుతో సరికొత్త వ్యూహరచన చేస్తున్నది ప్రభుత్వం అన్నారు.గ్రామ సభల్లో తనకు లబ్ధి చేరుకోరుతుందన్న ప్రజల కోరికలను ప్రభుత్వం వంచించింది అన్నారు. నిజానికి పథకాలు ఇచ్చేది ఉంటే ఇదే ప్రజల సమక్షంలో గ్రామసభల్లో ఎంపిక చేసి లబ్ధిదారులకు అందజేసేవారు స్థానిక ఎలక్షన్ల స్టంట్ కోసం గ్రామ సభలు నిర్వహించి మరొకసారి ప్రజలను మోసపుచ్చే నాటకానికి ఈ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన ప్రజా పాలనలో, అలాగే సమగ్ర కుల గణన సర్వేలో ప్రజలందరి డేటాను సేకరించిన ప్రభుత్వం మళ్ళీ కాలయాపన చేస్తూ గ్రామసభల పేరిట హడావుడి చేయటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక పెన్షన్లు డబల్ చేస్తామని, రైతుబంధును ఏడాదికి 15 వేల రూపాయలు చేస్తామని, కళ్యాణ లక్ష్మితో తులం బంగారంతో పాటు లక్ష రూపాయలు ఇస్తామని, నిరుద్యోగ భృతిని ఇస్తామని, విద్యార్థులకు స్కూటీ లు ఇస్తామని, ఇంకా మరెన్నో అమలు చేయలేని హామీలు ఇచ్చి ఆఖరికి ప్రధానమైన హామీ రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేక చేతులెత్తేసిన ఈ ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దారి మళ్లించే దిశలో భాగంగా వచ్చే ఎన్నికల్లో వారి పార్టీ లబ్దికోసం ఈ గ్రామ సభలను తెరమీదకి తీసుకొచ్చారన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజమైన అర్హులకు ఈ గ్రామ సభలో ఈ పథకాలను అందించేవారన్నారు . అలా చేయకుండా ప్రజలందరికీ ఆశపెట్టి గ్రామపంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి , మల్లొకసారి ప్రజలను మోసపుచ్చటానికి ఈ గ్రామ సభలు నిర్వహించారన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాడుతామని, ఇప్పటికైనా జనవరి 26వ తారీకు ఈ పథకాల ప్రారంభం రోజు గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారుల లిస్టు పెట్టాలని డిమాండ్ చేశారు….,ప్రభుత్వానికి తమ పరిపాలన మీద ,నమ్మకం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము….*
పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసమే గ్రామ సభలు – బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్
RELATED ARTICLES