ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నాడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, వెంటనే నారా చంద్రబాబునాయుడు ని విడుదల చేయాలని *”బాబు కోసం మేము సైతం”* అంటూ మాజీ శాసన సభ్యురాలు *తంగిరాల సౌమ్య* ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా *25వ రోజు దీక్షలో* పాల్గొన్న *కంచికచర్ల మండలం పరిటాల* గ్రామ తెదేపా నేతలకు జనసేన మరియు తెదేపా నేతలు దండలను వేసి వారి దీక్షను ప్రారంభింప చేయడం జరిగినది. భారత రాజ్యాంగం కాపాడబడాలి, న్యాయం, ధర్మం జరగాలి, రాజ్యాంగం గొప్పది,జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. రాష్ట్రంలోని ప్రజలు, అన్ని రాష్ట్రాల, జాతి సంపద చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు, ఆయన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తున్నారు. రాజకీయాలు శాశ్వతం కాదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు,రేపు వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే,సైకో పోవాలి సైకిల్ రావాలి….
న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ ధర్మం మావైపే ఉంటుంది
RELATED ARTICLES