Wednesday, March 19, 2025

నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పార్వేట మహోత్సవం

నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర నేడు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పా ర్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇంచార్జ్ చంద్రకేశవ దాసు తెలిపారు.  స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం 5గంటలకు ఇస్కాన్ భక్తులచే కీర్తనలు, 6 గంటలకు తులసి హారము, 6.45 నిమిషాలకు నరసింహ కీర్తనలు, 7 గంటలకు అతిథులకు సత్కారము, అనంతరము భోజన ప్రసాదం, 7.30 నిమిషాలకు ముఖ్య అతిథులచే ప్రవచనాలు, 8 గంటలకు వీర మోహన్ నాగసానిపల్లి సంగీతం భరత్ కుమార్ సారథ్యంలో సత్యమ్మ తల్లి చాగలమర్రి భజన బృందం చే చెక్కభజన కార్యక్రమం ప్రదర్శన, 12:30 కు లక్ష్మి నరసింహ స్వామి కి ఇస్కాన్ భక్త బృందం వారిచే కీర్తనలు పూలు మరియు దీప హారతులతో ఆహ్వానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 27వ తేదీ ఉదయం 4 గంటలకు మంగళ హారతి 5గంటలకు ఇస్కాన్ భక్త బృందం భక్తుల అంగరంగ వైభవంతో లక్ష్మి నరసింహ స్వామి అహోబిలం ప్రయాణము సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular