భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్, ను అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కారం చేశారు. తదనంతరం అశ్వరావుపేట నియోజకవర్గం లో ముఖ్యంగా పోడు భూముల సమస్యల గురించి మరియు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి యాదవలు డీడీల రూపంలో చెల్లించిన నగదు పెండింగ్ దశన ఉన్నందున ఆ సమస్యలను పరిష్కరించమని అలాగే అశ్వరావుపేట నియోజకవర్గం లోని పలు ప్రధాన సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధికి తోడ్పడాలని శాసనసభ్యులు జారే ఆదినారాయణ, కలెక్టరు కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోడు రైతులు యాదవ సోదరులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను సన్మానించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
RELATED ARTICLES