శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండమండల, బి.టి. పల్లి గ్రామానికి చెందిన వక్కలిగ కులమునకు చెందిన రంగధామప్ప, వయస్సు 68 సంవత్సరాలు S/o లేట్ తిమ్మప్ప అను అతను ఈ దినం ఉదయం సుమారు 9.00 గంటల సమయంలో వారి పొలములో ఉన్న మల్బరి షెడ్ ను శుభ్రం చేస్తుండగా అతనికి ఆ సమయంలో నీళ్ళ దప్పిక అయ్యి ఉండగా అనుకోకుండా వారి మల్బరి షెడ్ వద్ద మల్బరి షెడ్ ను శుభ్రం చేయడానికి ఉంచిన నీళ్ళ బాటిల్ లాంటి పార్మాలిన్ మందును అనుకోకుండా త్రాగాడని , అలా త్రాగడం వలన అతనికి కడుపులో మంట, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పగా, అతని బందువులు చికిత్స కొరకు గుడిబండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి చికిత్స చేయించగా,అక్కడ డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళమని సూచించగా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయగా, అక్కడ డాక్టర్ పరిశీలించగా మార్గమద్యంలోనే మృతి చెందాడు అని నిర్ధారించినారు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానము, వారంతా అంతా బెంగళూరు సిటి యందు చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అతని బార్య శాంతమ్మ, వయస్సు 60 సంవత్సరాలు W/o రంగధామప్ప అను ఆమె, ఆమె కుటుంబీకులతో పాటు గుడిబండ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేయగా గుడిబండ పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ A. ముని ప్రతాప్ పిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా శవమునకు పోస్ట్ మార్టం నిర్వహించారు.
నీళ్ళ బాటిల్ అనుకొని ఫార్మాలిన్ తాగి వ్యక్తి మృతి
RELATED ARTICLES