వరదయ్యపాలెం మండలంలోని ఇందిరానగర్ పంచాయతీకి సంబంధించి గోవర్ధనపురంలోని ఒక వార్డు ప్రజలు నీటి సరఫరా లేక గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై స్థానిక సర్పంచి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో కనీసం కాల కృత్యాలకు నీళ్లు లేకపోవడంతో ఆగ్రహం చెందిన ప్రజలు మంగళవారం ఉదయం కాళహస్తి,తడ రహదారిపై కాళీ బిందెలతో మెరుపు నిరసన కార్యక్రమం చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలియజేస్తున్న గ్రామ ప్రజలకు సర్ది చెప్పి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఏ ఎస్ ఐ షణ్ముగం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు.
వరదయ్యపాలెం పంచాయతీ లోకి మార్చి పుణ్యం కట్టుకోండి …
వరదయ్యపాలెం పంచాయతీకి ఆనుకొని ఉన్న తమను సంబంధంలేని ఇందిరానగర్ పంచాయతీలో ఉండటంతో ఊరికి దూరంగా ఉన్నామని ఇందిరానగర్ పంచాయతీ నాయకులు , మా పంచాయతీ కాదని వరదయ్యపాలెం నాయకులు తమను వెలివేసినట్లు సీత కన్ను వేసారన్నారు. మేము పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని నాయకుల రాజకీయ లబ్ధి వలన తాము కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ వార్డును తమకు అనుకూలంగా ఉన్న వరదయ్యపాలెం పంచాయతీలో కలిపి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
సమస్యపై స్పందించిన క్లస్టర్ ఇంచార్జ్ పన్నెం నిర్మల్ కుమార్!
గోవర్ధనపురంలోని ఇందిరానగర్ పంచాయతీ వార్డు ప్రజల నీటి సమస్య తన దృష్టికి వచ్చిందని,వచ్చిన వెంటనే వరదయ్యపాలెం పంచాయతీ సెక్రటరీ తో మాట్లాడి జేసీబీ పెట్టి కొత్త పైపులైన్లు వేసి వారికి వెంటనే నీటి సమస్యను తీర్చేందుకు ఈరోజు ఉదయం నుండే పనులు ప్రారంభించరన్నారు.అలాగే పంచాయతీ మార్పు విషయమై తనవంతు బాధ్యతగా వరదయ్యపాలెం పంచాయితీ లోకి మార్చేందుకు సహకరిస్తానని వరదయ్యపాలెం పంచాయితీ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ పన్నెం నిర్మల్ కుమార్ తెలిపారు.