TEJA NEWS TV
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే కొంచెం ఊరట గా అనిపించేలా
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుండి నిలకడగా కొనసాగుతోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఐదు గంటల సమయానికి 50.5 అడుగులు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అని వెల్లడించారు. ఈ నేపద్యంలో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగిన స్వల్పంగా పెరిగి అనంతరం తగ్గుముఖం పట్టే అవకాశం మెండుగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనాప్పటికీ గోదావరి నది హఠాత్తుగా ఉదృతంగా పోటెత్తడంతో భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న లోతట్టు ప్రాంతాలైనటువంటి, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు వెంకటాపురం, మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపుగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. నేడు
గోదావరి తగ్గుముఖం పట్టడంతో నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
నిలకడగా భద్రాచలం గోదావరి
RELATED ARTICLES