పేదవారికి సీఎం సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం స్థానిక కాకానీ నగర్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పెద్దాపురం వీరులపాడు మండలంకు చెందిన రంగిశెట్టి నీలిమ కు రూ.5లక్షలు, నందిగామ పట్టణానికి కాకానీ నగర్ కు లేళ్ళ సావిత్రి రూ. 92,902/- ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఆపద సమయాల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదరికంతో బాదపడుతూ అనారోగ్యాలబారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి
:ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES