నిధులు మంజూరు అయ్యేనా.. భవన నిర్మాణం సాగేనా
నిధులు లేక అర్ధాంతరంగా ఆగిన పాఠశాల భవనం
పీఎం శ్రీ నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు
నాణ్యత లేదంటున్న ప్రజలు
రాష్ట్రంలోనే నాలుగు మాధ్యమాలు కలిగిన ఏకైక పాఠశాల మండల కేంద్రం హోళ గుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల నందు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాలకు సంబంధించి సుమారు 2వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2వేల మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్న ఈ పాఠ శాలకు గత ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా అదనపు గదులు నిర్మాణం చేపట్టు టకు 2.32 కోట్ల నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంపడం జరిగింది. గత ప్రభుత్వం గదుల నిర్మాణం కొరకు – మొదటి విడతగా 1.10 కోట్లు నిధులు మంజూరు చేయడంతో ఆ నిధుల ద్వారా అరకొర భవన నిర్మాణాలు
చేపట్టడంతో ఆ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టు టకు ప్రభుత్వము నిధులను మంజూరు చేయనుందా అర్ధాంతరంగా ఆగినపాఠశాల భవననిర్మాణాలు పూర్తికా నున్నాయా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వము నిధులు మంజూరు చేయకపోతే భవన నిర్మాణాలు ప్రభుత్వం మంజూరు చేసిన1.10కోట్ల నిధులు వృధాగా నీరు గారే పరిస్థితి నెలకొంది. అరకోరగా నిర్మాణం చేపట్టిన పాఠశాల అదనపు భవన నిర్మాణాలకు జిల్లా సంబంధిత అధికారులు దృష్టి సారించి నిధులు మంజూ రు చేసి పాఠశాల భవనాలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పీఎం శ్రీ నిధులు జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి కొరకు మరో 63 లక్షల అదనపు నిదులను మంజూరు చేయడం జరిగింది. ఆనిధులలో 23లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనం నిర్మాణ పనులు జరగనున్నాయి.
నూతనంగా నిర్మాణం చేపడుతున్న భవనం నాణ్యత లోపించిందని భవన నిర్మాణానికి వేసిన పిల్లర్లకు నాణ్యత లోపించడంతో సిమెంట్ పూతలతో భవన నిర్మాణం సాగుతుందని సంబంధిత అధికారులు భవన నిర్మాణం నాణ్యతగా చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న గ్రంథాలయ భవన నిర్మాణ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ ను వివరణ కోరగా భవన నిర్మాణాన్ని నాణ్యతగా నిర్మాణంచేపడుతున్నామని.సిమెంట్ ఒక్కటే ఓపిసి సిమెంట్ వాడటం లేదని సమాధానం తెలిపారు.
నిధులు లేక అర్ధాంతరంగా ఆగిన పాఠశాల భవనం
RELATED ARTICLES