
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని వెల్గానూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు STUTS క్యాలెండర్ ను డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా స్టేజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సభ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు తో మాట్లాడుతూ టీచర్ల సమస్యలైన టీచర్ల బదిలీలు, టీచర్ల ప్రమోషన్ లు, పిఆర్సి విడుదల, సిపిఎస్ రద్దు వంటి సమస్యలను విన్నవించుకున్నారు.టీచర్ల సమస్యలను విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి టీచర్ల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు జిల్లా అధ్యక్షులు జై హనుమంత్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రాములు,కోశాధికారి సయ్యద్ కలిమొద్దీన్, విజయ్ కుమార్,రాజేందర్, జయకర్,యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.