తేజ న్యూస్ టీవీ నిజం సాగర్ : లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ అయ్యప్ప మాలధారణ స్వామి మృతి చందగ మరో ఐదుగురు స్వాములకు తీవ్ర గాయా లైనా ఘటన బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని చర్చి వద్ద ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కల్లేరు మండలంలోని మాసంపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు అయ్యప్ప మాలధారణ స్వాములు మాసంపల్లి గ్రామం నుండి ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో జరిగిన అయ్యప్ప స్వాముల దీక్షకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా డీ కొట్టింది. దాంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఎంబూరి కాశయ్య (55) అనే స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. కొల్లూరి విట్టల్ అనే మరో స్వామికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉప్పరి సాయిలు, అంజయ్య, మంగలి లింగం, చేనూరి అనిల్ అనే స్వాములను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఆటో ను ఢీ కొట్టిన లారీ డ్రైవర్ లారీని వదిలిపెట్టి పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.
నిజాంసాగర్: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప మలదరణ స్వామి మృతి
RELATED ARTICLES