TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు బీఆర్ఎస్ లోకి చేరారు. వారు గతంలో బిజెపిలో పని చేసి వారు కెసిఆర్ అమలు చేసే పథకాలను చూసి వారు బీఆర్ఎస్ లోకి వచ్చామని అన్నారు. నగేష్, సాయిలు, బాలయ్య, అంజయ్య,వడ్ల రాజు, ఆదివారం రోజున మండల సీనియర్ నాయకుడు పట్లోళ్ల దుర్గారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో కి చేరారు. అనంతరం వారికి సీనియర్ నాయకుడు పార్టీ కండువా కప్పి పార్టీల్లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ……. బీఆర్ఎస్ పథకలు అందని ఇల్లు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తోని అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు పట్లోళ్ల దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, మోహన్ రెడ్డి, నర్సింగ్ రావు పల్లి గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దత్తారెడ్డి, రామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గోగుల పండరి, సంధిలా రాజు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ : నిజాంసాగర్ బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు
RELATED ARTICLES