

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో సోమవారం దసరా పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ కులమత బేధాలు లేకుండా చాలాసంతోషగా జరుపుకున్నారు. అనంతరం నూతన వస్త్రాలను ధరించి, గ్రామ శివారులో ఏర్పాటు చేసిన జమ్మి వృక్షం వద్దకు భాజ భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లారు. పూజారి పూజలు చేసిన అనంతరం దేవుళ్లకు జమ్మి ఆకు బంగారం సమర్పించారు. అనంతరం గ్రామస్తులు ఒకరికొకరు జమ్మి ఆకు పంచుకున్నారు.