యన్టీఆర్ జిల్లా నందిగామ రైతు పేట లో గల నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ప్రిన్సిపాల్ కుమారస్వామి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి .
పాఠశాల ఆవరణలో ఒక పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా గుడిసెలు నిర్మించి వివిధ రంగవల్లికలతో అలంకరించుట జరిగినది .
రైతు తను పండించినటువంటి మొట్టమొదటి పంటకు ఇచ్చే తొలి సంతోషకానుక ఈ సంక్రాంతి అని,మన సంస్కృతి ని తెలియజేసే పండుగ అని ప్రిన్సిపల్ కుమారస్వామి అన్నారు .
సంక్రాంతి సంబరాలలో భాగంగా పిల్లలు రైతులు వేషంలో ,హరిదాసులు వేషంలో సంప్రదాయ వస్త్రధారణ తో చూపరులను ఆకట్టుకున్నారు .
పాఠశాల ఆవరణలో పొంగలి, ముగ్గుల పోటీలు, గాలిపటాల తయారీ, వాలు జడ పోటీలు, బొమ్మల కొలువు అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
పిల్లలకు పెద్దల చేత తలపై బోగి పండ్లు (రేగి పండ్లు) పోయటం జరిగింది.
విద్యార్థిని విద్యార్థులు ,ఉపాధ్యాయ తర సిబ్బంది ఏజీఎం . హరీష్ , ఆర్ఐ , పవన్ కుమార్, ప్రీ ప్రైమరీ డీన్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్స్ ముంతాజ్ బేగం, భవాని,రోజా తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ విభాగాలలో బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
ఇటువంటి కార్యక్రమాలు రైతు యొక్క గొప్పతనాన్ని పండగ యొక్క ప్రాముఖ్యతను భారత దేశ సాంస్కృతిక మేలవింపును తెలియజేస్తాయి అని ఏజియం . హరీష్ తెలియజేశారు.
నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
RELATED ARTICLES