ఎటునాగారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కాళోజీ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ జయంతిని పురస్కరించుకొని కళాశాల ప్రధానఆచార్యులు డాక్టర్ బి.రేణుక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ కాళోజి నారాయణరావు తెలంగాణ భాషకు చేసిన సేవను రాసిన వివిధ పుస్తకాల గాను అనేక పురస్కారాలు అందుకొని తెలుగు భాషను నిలబెట్టడంలో ప్రథమ భూమిక పోషించారని విద్యార్థులకు ఉన్న అధ్యాపకులకు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆంశలను ప్రజలను చైతన్య పరచడంలో ఆయన కృషి ఎంతో ఉంది అని ఆయన రాసిన ఒక్కొక్క అక్షరం చైతన్యాన్ని నూరిపోసే విధంగా ప్రజలను ఉత్తేజపరిచిన ప్రజాకవి కాలోజీ అని పేర్కొన్నారు. తెలుగు భాష ఇంకా ఊపిరి పోసుకుంటుంది అంటే దానికి మూల కారణం కాలోజీ అని కొని ఆడారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక కాళోజీలా తయారు కావాలి అని ఈ సందర్భంగా వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కాళోజీ రావు జయంతి వేడుకలు
RELATED ARTICLES