బుచ్చిరెడ్డిపాళెం జూన్ 06 (తేజ న్యూస్ టీవీ )
సమాజంతో కలిసి మెలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి అవసరమైన విలువలు, విజ్ఞానం, వికాసం, నైపుణ్యం నవతరానికి అందించేవి గ్రంధాలయాలని బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ అధికారి-2 పాతపాటి వెంకటరత్నం అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం శాఖా గ్రంధాలయంలో శుక్రవారం వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, ఐకమత్యం, పుస్తక పఠనం, వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలు ప్రతిరోజు గ్రంథాలయానికి రావడం వల్లే వికసిస్తాయన్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలో చురుకుగా పాల్గొని పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. శాఖా గ్రంధాలయంలో రెండు సంవత్సరాలపాటు సేవలందించి రంగనాయకులపేట గ్రంథాలయానికి బదిలీ కాబడిన గ్రంధాలయ అధికారిని కే. మంజులతను సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రంథాలయ అధికారి నరసింహారావును స్వాగతించారు. గ్రంధాలయంలో అత్యున్నత సేవలు అందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసిన రిటైర్డ్ లైబ్రేరియన్ భూపతి సత్యనారాయణ సేవలను ప్రశంసించారు. 40 రోజుల పాటు అలుపెరగకుండా నిత్యం గ్రంథాలయానికి సృజనాత్మక కార్యక్రమాలను పిల్లలకు పరిచయం చేసి ఆనందంగా, ఆహ్లాదంగా వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు, సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిణి కే. మంజులత, గ్రంథాలయ అధికారి నరసింహారావు, గ్రంధాలయ రత్న పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్ల నరసింహ స్వామి, రిటైర్డ్ లైబ్రరేయన్ భూపతి సత్యనారాయణ, యోగా మాస్టర్ పచ్చారి శ్రీనివాసులు, విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.
నవతరానికి గ్రంధాలయాలు
RELATED ARTICLES