నర్సంపేట మండలం ఇటికలపల్లి గ్రామ శివారు నర్సింగాపురం గ్రామంలో పి వై ఎల్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే నుండి మేడపల్లి వెళ్లే రహదారిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు లింగదారి శంకర్ పాల్గొని ఈ క్రింది విధంగా మాట్లాడడం జరిగింది.
గత సంవత్సరం జూన్ నెలలో నేషనల్ హైవే నుండి నర్సింగాపురం మీదుగా మేడపల్లి వెళ్లే రహదారి 2 కిలోమీటర్ల మేరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అయితే నరసింగాపురం గ్రామంలో 200 మీటర్ల మేరకు రోడ్డును వదిలేయడం జరిగిందన్నారు . గత సంవత్సరం వర్షాకాలం నుండి ఇప్పటివరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. నిర్మాణం చేయకపోవడంతో రోడ్డు గుంతలు ఏర్పడి టూవీలర్లు మీద వెళ్లే వాళ్లు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు గొర్రె రాజు, భర్తీపాక మధు, నూకలమర్రి మహేందర్, లావుద్య బాలాజీ ,గుర్రాల శంకర్ ,గొర్రె బిక్షపతి గొర్రె మహేందర్ జాలిగం సాయికిరణ్, గొర్రె గణేష్ ,నేరెళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింగాపురం గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు నిర్మాణం చేపట్టాలి
RELATED ARTICLES