వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షుడిగా కట్ల మోహన్ రెడ్డి (భానొజీపేట) ప్రధాన కార్యదర్శిగా నూనె అశోక్ (రాజుపేట) ఉపాధ్యక్షులుగా పుట్ట సురేష్ (మాదన్నపేట) సహాయ కార్యదర్శిగా మారేపల్లి విజేందర్ (నాగూర్ల పల్లె )లను నర్సంపేట మండల కమిటీగా జిల్లా అధ్యక్షుడు కాటా కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ లోని ఆయా మండలాలలో సమాచార హక్కు చట్టంపై పౌరులకు అవగాహన కల్పించుటకు తమ వంతు బాధ్యతగా ప్రతి మండలంలో కమిటీలు వేసి పౌరుల యొక్క మానవ హక్కులను కాపాడుటకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల అధ్యక్షుడు గూడపు అమరేందర్ ,ప్రధాన కార్యదర్శి నమీండ్ల రమేష్, ఉపాధ్యక్షుడు మనుబోతుల శివకూమర్, కార్యదర్శి దార కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షుడిగా కట్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నూనె అశోక్
RELATED ARTICLES