అధికారులు కాలనీలు, మురికివాడలు ,లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి
రాజకీయాలకతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేద్దాం
మున్సిపల్ సాధారణ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట
పట్టణానికి 365 రోజులు మంచినీటి అందించే సంకల్పంతో 12 కోట్ల మంజూరు
మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు కాలి స్థలాల్లో నూతన భవనాలు నిర్మించాలి
నర్సంపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి హాజరై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల తెలియజేసిన విషయాలను స్వీకరించడం జరిగింది అనంతరం దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా నర్సంపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కాలనీలను మురికి వాడలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని, రాజకీయాలకతీతంగా కౌన్సిలర్లు చైర్మన్ అధికారులు పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 365 రోజులు మంచినీటిని అందించడమే నా సంకల్పమని అన్నారు పట్టణ అభివృద్ధికి 40 కోట్ల రూపాయలతో ప్రతి డివిజన్లో కోటి 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్ పూర్తయిందని తెలియజేశారు సభ్యులు ఏవైనా ఇబ్బందులు ఉంటే కమిషనర్ చైర్ పర్సన్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపాలిటీలో నిధులు లేకపోయినా నా సొంత నిధులతో అభివృద్ధికి సహకరిస్తానని మరిన్ని నిధులతో పటాభివృద్ధి జరగాలని అండర్ డ్రైనేజీ సిస్టం నర్సంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే సంకల్పంతో కృషి చేస్తున్నానని అన్నారు, పట్టణంలో అదనపు కాంప్లెక్స్ ల నిర్మాణం చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మహిళా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం 23% సబ్సిడీ ఇస్తుందని అన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ గుంటి రజిని కమిషనర్ శ్రీనివాస్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ కౌన్సిలర్లు ఇంజనీరింగ్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.