కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామంలో నజీర్, నవాజ్ లు నమాజ్ చేస్తున్న సమయంలో కర్రలతో దాడి చేశారు. ఆ గ్రామంలో ముస్లింలకు చెందిన ఇనామీ భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. గత నెల రోజుల కిందట ఆ భూమిని వక్ఫ్ బోర్డు వాళ్లు వేలంపాట వేశారు. ఈ వేలంపాటలో మాజీ మూతవల్లి ముల్ల కాశిం మరియు తన కుమారులు ఖాజా, రెహమత్ అలీ , జిలాన్, అబ్దుల్ వక్ఫ్ బోర్డు వేలంపాటలో భూమిని సొంతం చేసుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఆ వేలంపాటలో భూమిని నజీర్, నవాజ్ లు సొంతం చేసుకున్నారు. శుక్రవారం మసీదులో నజీర్, నవాజ్ లు నమాజ్ చేస్తుండగా మాజీ మూతవల్లి కాశిం తన కుమారులు ఖాజా, రెహమత్ అలీ, జిలాన్, అబ్దుల్ అందరూ కలిసి పథకం ప్రకారం నజీర్, నవాజ్ లపై కర్రలతో దాడి చేసి గొడ్డలి తీసుకొచ్చి చంపుతామని బెదిరించారు. ఈ దాడి లో గాయపడిన వారు ప్రస్తుతం ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.
నమాజ్ చేస్తున్న సమయంలో కర్రలతో దాడి..
RELATED ARTICLES