TEJA NEWS TV : నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పగిడాల మండలం, ముచ్చు మర్రి గ్రామంలో చిన్నారి వాసంతి ని అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శనివారం రాత్రి కొవ్వతులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్.రంగనాయుడు మాట్లాడుతూ చిన్నారి వాసంతి హత్య జరిగి వారం రోజులైనప్పటికీ ఇంతవరకు శవాన్ని గుర్తించకపోవడం దారుణమని ఇది పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కలుగజేసుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదని నిర్లక్ష్యం వహించిన సీఐని, పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనర్ బాలిక వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడవేసినట్లు మైనర్ బాలురే చెబుతుంటే ఇంతవరకు అమ్మాయి జాడ లేదన్నారు. ఎంపీ సొంత గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని స్వయంగా కొందరు నాయకులు ఆరోపిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు హత్యపై రోజుకో కథలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు చిన్నారులకు రక్షణ కరువైందని వెంటనే హత్యకు గురైన వాసంతి ఆచూకీ కనిపెట్టాలని లేనట్లయితే సిపిఐ ఆధ్వర్యంలో ముచ్చుమర్రి గ్రామంలో ఆందోళన చేపడతామని రంగనాయుడు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్,. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. భాస్కర్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్,, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలుఎస్.మున్ని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు గోకారి.సిపిఐ నాయకులు ఎస్ ఖలీల్. చాంద్ భాషా. కరీముల్లా. మహబూబ్. తదితరులు పాల్గొన్నారు
నంద్యాల: వాసంతి హత్యను నిరసిస్తూ… దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
RELATED ARTICLES