TEJA NEWS TV
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను భాగంగా చట్టసభల్లో మహిళలకు తక్షణం 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేమిమ్ బేగం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి కి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాక్య ఎన్.ఎఫ్.ఐడబ్ల్యు. ఆధ్వర్యంలో భారత జాతీయ మహిళా సమాక్య పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా చట్ట సభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును తక్షణం ఆమలు అయ్యేలా నవంబర్ లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని కోరుతూ ఈరోజు నంద్యాల జిల్లా పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి కి వినతి పత్రం అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు మహిళా సభ్యులు పీ.మాధవి, షబానా,మాధవి,మాధవి లత, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా: చట్టసభల్లో తక్షణం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కల్పించాలి…..ఎన్.ఎఫ్,ఐడబ్ల్యు.వర్కింగ్ ప్రెసిడెంట్ షేమిమ్ బేగం
RELATED ARTICLES