TEJA NEWS TV
నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బరాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్షావలి జిల్లా క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపికయ్యారు. ఆగస్టు29వ తారీకు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా పద్మావతి నగర్ లోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ యందు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు పంపినటువంటి మెమొంటోలు శాలువాలు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. అవార్డులు అందుకున్న హెడ్మాస్టర్ సుబ్బరాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్షావలి మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడా పోటీల కు 25 మంది విద్యార్థులు రెజ్లింగ్ హ్యాండ్ బాల్ బేస్ బాల్ ,సాఫ్ట్ బాల్, జూడో, అథెంటిక్స్, పోటీలకు ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయిలో జూడో క్రీడలో రెండవ స్థానం నిలిచారన్నారు, జాతీయస్థాయిలో బేస్బాల్ పోటీల కు విద్యార్థి ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు పోటీలకు ఎంపిక అయ్యేందుకు కృషి చేసినందుకు జిల్లాలో రెండో స్థానంలో నిలిచామన్నారు. దీంతో అధికారులు అవార్డు లు అందజేశారన్నారు.
నంద్యాల: జిల్లా క్రీడా ప్రతిభా అవార్డు అందుకున్న హెడ్మాస్టర్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు.
RELATED ARTICLES