TEJA NEWS TV నంద్యాల జిల్లా
07-08–2024 *డ్రంక్ అండ్ డ్రైవ్ లో 07 కేసులు నమోదు….* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై 96 కేసులు నమోదు….* *మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘించిన వారిపై 185 కేసులు నమోదు 78,135 రూపాయల జరిమాన …..* *పేకాట ఆడుచున్న 09 మందిపై కేసు నమోదు 11,400 రూపాయలు స్వాదినం…..* *జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 వాహనాలు సీజ్ చేసి 34 టన్నుల ఇసుక స్వాదినం….* *నాటుసారాయి అమ్మేవారిపై 05 కేసులు నమోదు 150 లీటర్ల సారాయి స్వాదినం…..* *DPL కేసులు 03 నమోదు 13.10 లీటర్ల మద్యం స్వాదినం….* నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు నంద్యాల జిల్లాలో నేరానివారనే లక్షంగా విజిబుల్ పోలిసింగ్,ఎన్ఫోస్మెంట్ పనులు జరగాలని ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలో అన్నీ పోలీసు స్టేషన్ పరీదులలో పోలీసు అదికారులు మట్కా,జూదము,అక్రమ మధ్యం,ఇసుక ,డ్రంకన్ & డ్రైవ్,రోడ్డు ప్రమాదాల నివారణకు మోటార్ విహికల్ ఆక్ట్ ను కట్టుదిట్టంగా అమలు చెయ్యడం మొదలగు వాటిని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో నంద్యాల జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ పరిధిలలో గల అదికారులు వారి సిబ్బంది సహాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టగా మొత్తం 07 కేసులు నమోదు కావడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా 96 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది.జిల్లాలో మోటార్ వెహికల్ చట్టం అమలుచేస్తు 185 కేసులు నమోదు చేసి 78,135/- రూపాయలను జరిమాన విదించడం జరిగింది. నంద్యాల జిల్లా ఢోన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిదిలోని మున్సిపల్ కార్యాలయం వెనుక పేకాట ఆడుతున్నట్లు ఢోన్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు విషయం తెలుసుకున్న సబ్ -ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ గారు తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని పేకాట ఆడుతున్న09 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 11,400/-రూపాయల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చెయ్యడం జరిగింది. జిల్లా అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో SEB మరియు సివిల్ పోలీసుల అదికారుల ఆద్వర్యంలో నాటు సారాయి అమ్మే వ్యక్తులపై దాడులుచేసి 05 కేసులు నమోదు చేసి 150 లీటర్ల సారాయిని స్వాదినం చేసుకోవడం జరిగింది.ఇందులో 03 DPL కేసులలో 13.10 లీటర్లు మధ్యంను స్వాదినం చేసుకోవడంతోపాటు 700 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చెయ్యడం జరిగింది.అంతేకాక అక్రమంగా ఇసుక తరలిస్తున్న నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసి 03 వాహనాలను సీజ్ చేసి 34 టన్నుల ఇసుకను స్వాదినం చేసుకోవడం జరిగింది.
నంద్యాల జిల్లాలో నేరానివారనే లక్షంగా విజిబుల్ పోలిసింగ్ – ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
RELATED ARTICLES