నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి..ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో కొట్టడంతో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పాతకక్షలే కారణమని స్థానికులు అంటున్నారు. గ్రామంలో ఉద్రిక్తతగా ఉండటంతో పోలీస్ బలగాలు మోహరించాయి. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో దారుణ హత్య
RELATED ARTICLES