TEJA NEWS TV
స్కూల్ పేరుతో ముద్రించిన పుస్తకాలను వేల రూపాయలు అమ్ముతున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్పొరేట్ విద్యాసంస్థల ఫ్లెక్సీలు
సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల హడావిడిలో పడి కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న చూసి చూడనట్టు వివరిస్తున్న డిఈఓ ఆర్ఐఓ జిల్లా విద్య శాఖఅధికారులు
PDSU ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం
* నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని PDSU ఆధ్వర్యంలో ఆదివారం నాడు APTF కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తుగా అడ్మిషన్లు చేపట్టడం జరుగుతుందన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటనలు చేసిన ఆ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోకుండా అడ్మిషన్లు చేస్తూ నగరంలో వివిధ సంస్థలకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు.నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు పర్మిషన్ లేకపోయినా కూడా ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేశారన్నారు.ఈ నెలలో చేసుకుంటే ఒక ఫీజు జూన్ మాసంలో చేసుకుంటే ఒక ఫీజ్ అని తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు చేస్తున్నారన్నారు ఇప్పటికే కొన్ని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పూర్తి అయినాయని బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారులు పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు తప్ప ఎక్కడ కూడా ప్రత్యక్షంగా సందర్శించింది లేదన్నారు. డీఈఓ గారు ఆర్ ఐ ఓ గారు తక్షణమే కార్పొరేట్ విద్యాసంస్థలను సందర్శించి ఏవైతే అడ్మిషన్లు చేస్తున్నారో వాటి పైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలన్నారు.అదేవిధంగా నగరంలో పలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు దినాలలో కూడా విద్యార్థులకు మానసిక ఉల్లాసం లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు తరగతులు హాజరుకాని విద్యార్థులకు విద్యాసంస్థల యాజమాన్యులు భయపెడుతూ మీరు కచ్చితంగా తరగతులకు హాజరుకావాలని హుక్కుమ్ జారీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ చేస్తున్న జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఏ ఒక్క విద్యా సంస్థలను సందర్శించింది లేదన్నారు ఎలక్షన్లు పూర్తయినాయి ఇప్పటికైనా కార్పొరేట్ విద్యాసంస్థల దందా దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు.తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థల పైన మరియు ముందస్తు అడ్మిషన్లు విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో PDSU ఆధ్వర్యంలో రేపటి నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో PDSU నగర అధ్యక్ష కార్యదర్శు లు షేక్ షాహిద్, వినోద్ జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ,నగర నాయకులు హరిక్రిష్ణ ,వంశీ,కిరణ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు*