ఎన్టీఆర్ జిల్లా నందిగామ
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు
యన్టీఆర్ జిల్లా నందిగామ స్థానిక రైతు పేట నందు గల శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు ఐదవ తరగతి నుండి ఆరవ తరగతికి ప్రమోట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు
విద్యార్థినీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ ఆఫ్రాన్ ధరింప చేసి వారు ఆరవ తరగతికి ప్రమోట్ అయినట్లుగా సర్టిఫికెట్ వారికి అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ గుత్తా ప్రదీప్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థినీ విద్యార్థులకు భవిష్యత్తులో వారు నిర్దేశించుకోవలసినటువంటి లక్ష్యాలను గుర్తు చేస్తాయని తెలియచెప్పారు అదే విధంగా కాలానుగుణంగా వారు నిర్ణయాత్మక శక్తిలా మారుతున్నాము అని గ్రహించుకునేటటువంటి రోజే గ్రాడ్యుయేషన్ డే అని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు జరగటంతో పాటుగా వివిధ విభాగాలలో బహుమతులు పొందినటువంటి
విద్యార్థిని విద్యార్థులను సత్కరించుట జరిగినది ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ ఆర్ఐ వినోద్ పాల్గొని విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు:
నందిగామ: శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సంబరాలు
RELATED ARTICLES