TEJA NEWS TV
స్థానిక రైతు పేట నందు గల శ్రీ చైతన్య పాఠశాలలో ఫిబ్రవరి 28 డాక్టర్ చంద్రశేఖర్ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని ప్రిన్సిపల్ గుత్తా .ప్రదీప్ తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సుమారు 400కు పైగా ప్రాజెక్ట్స్ ను విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శనకు ఉంచటం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందిగామ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనీష్ గ విద్యార్థులను అభినందించుట జరిగినది .ఈ ప్రదర్శనలో బహుమతులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు సీఐ గారు బహుమతి ప్రధానం చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఈజిఎం, మురళీకృష్ణ మరియు ఆర్ఐ, వినోద్ గారు విచ్చేసి అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థిని విద్యార్థులను అభినందించుట జరిగినది.