ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
*హెల్మెట్ ధరించండి ప్రాణ రక్షణ పొందండి*
*వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి : సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం*
*వాహనం నడిపేటప్పుడు కనీస అవగాహన ఉండాలి: సివిల్ జడ్జ్ రియాజ్*
*హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి: సీఐ హనీష్*
నందిగామ పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నుండ్రు విద్యాసాగర్ అధ్యక్షతన పట్టణంలోని కమ్మ కళ్యాణమండపం నందు హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందిగామ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రియాజ్, పట్టణ సిఐ హనీష్ పాల్గొన్నారు. సివిల్ జడ్జ్ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ను ఉపయోగించాలని, విధిగా 18 సంవత్సరాలు దాటిన వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, బండికి సంబంధించిన సి బుక్ ఇన్సూరెన్స్ ఉండాలని సూచనలు చేశారు. పట్టణ సీఐ హనీష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు కనీస అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాన్ని రక్షించుకొనుటకు హెల్మెట్ ఏవిధంగా ఉపయోగపడుతుందో వాహనదారులకు వివరించారు.హెల్మెట్ ధరించండి ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణ పొందండి మీ పై ఆధారపడ్డ మీ కుటుంబానికి అండగా నిలవండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందిగామ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రియాజ్, సీఐ హనీష్, బార్ అధ్యక్షులు విద్యాసాగర్, ఎస్సై పండు దొర,ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ సుందర్, సుధీర్ న్యాయవాది ఎక్కిరాల, రవికుమార్ ,కొమ్మినేని మల్లేశ్వరరావు,సీనియర్ విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.