*యన్టీఆర్ జిల్ల నందిగామ లో సోమవారం రోజున ” యోగాంధ్ర ” ర్యాలీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర మాసంగా ప్రకటించిన సందర్భంగా నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నందిగామ లో మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీదుగా యోగ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యోగ సాధకులు స్థానిక సాధారణ ప్రజలతో కలిసి సోమవారం ఉదయం నందిగామ డివిజనల్ అధికారి బాలకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, నందిగామ మండలం యం.పి.డి.ఓ.శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ మండవ కృష్ణకుమారి, కమీషనర్ రమణ బాబు, నందిగామ మండలం యోగాంధ్ర కో – ఆర్డినేటర్లు డాక్టర్. కృష్ణ మోహన్, డాక్టర్. కవిత యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు,యస్.కె.కరిముల్ల ఇతర అధికారుల తో కలిసి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ” యోగాంధ్ర ” ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యోగ ఫ్లకార్డులు చేతబూని యోగా చేయండి ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాల తో గాంధీ సెంటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నందిగామ డివిజినల్ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగ నేడు విశ్వ వ్యాప్తమైనదని అన్నారు.నేడు ఎన్నో దేశాలలో ప్రజలు తమ రోజువారీ దిన చర్యలో యోగాను భాగం చేసుకుంటున్నారని అన్నారు. యోగాంధ్ర మాసం సందర్భంగా నందిగామ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామం, నందిగామ పట్టణం లో ప్రతి రోజు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. యోగ పై సాధారణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, యోగ చేయడం ద్వారా రోగాలు దరి చేరవని మంచి ఆరోగ్యం కోసం అందరూ ప్రతిరోజు యోగా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమం లో రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ శ్రీరాములు,ఆర్ . ఐ. లావణ్య , సీనియర్ అసిస్టెంట్ వేణు కుమారి, సచివాలయం ఉద్యోగులు,గురవయ్య , ఇతర మున్సిపల్ అధికారులు,క రీమ్, స్థానిక ప్రజలు తదితరులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.*
నందిగామ లో ” యోగాంధ్ర ” ర్యాలీ
RELATED ARTICLES