Thursday, January 15, 2026

నందిగామ లో ఘనంగా విశ్వఖర్మ జయంతి

TEJA NEWS TV

యన్టీఆర్ జిల్ల నందిగామ పట్టణం విశ్వఖర్మ జయంతిని పురస్కరించుకొని నందిగామ పట్టణ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ఆలయ ప్రాంగణమునందు విశ్వసృష్టికి, సమస్త వృత్తులకు మూలకారకుడైన విశ్వఖర్మ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన పూజ, జండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్  మాట్లాడుతూ సహస్ర కళలకు, నైపుణ్యాలకు అధిపతి అయిన విశ్వకర్మ ఆశీస్సులతో… మీరు, మీ కుటుంబ సభ్యులు మీ మీ వృత్తులలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. విశ్వకర్మ మీకు శ్రేయస్సును, అభివృద్ధిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular