యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం లో గల ప్రభుత్వ ఏరియా వైధ్యశాల లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు మరియు నందిగామ ఆయుర్వేద వైధ్యశాల డాక్టర్.కొప్పుల కృష్ణ మోహన్ వారి ఆధ్వర్యం లో మంగళవారం రోజున దన్వంతరి జయంతి మరియు 10 వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరిగింది…
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు , వైధ్యులు మాట్లాడుతూ ధన్వంతరి గొప్పతనాన్ని ,ఆయుర్వేద వైధ్యం ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. అందరూ ఆయుర్వేద ఔషధ తైలము లు,మందులు ఉపయోగించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమానికి నందిగామ లైన్స్ క్లబ్ వారు కూడా సహకారం అందించారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్మన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ జి .లోవరాజు, నందిగామ డివిజనల్ ఎ.సిపి.,ఎ.బి.జి.తిలక్, ఏరియా వైధ్యశాల ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్. సత్యన్నారాయణ, డాక్టర్.వెంకటేశ్వరరావు, ప్రముఖ హోమియోపతి వైధ్యులు డాక్టర్.భాను ప్రసాద్, ఆయుర్వేద వైధ్యులు డాక్టర్.కొప్పుల కృష్ణ మోహన్, డాక్టర్.కవిత, డాక్టర్.కె.,వాణి, డాక్టర్.పద్మజ, డాక్టర్ .సుకన్య,డాక్టర్.విష్ణు వర్ధన్, డాక్టర్.జునీద్,నేచురోపతి వైధ్యురాలు డాక్టర్.వాణి, హోమియోపతి వైధ్యులు డాక్టర్.మల్లేశ్వరరావు, సహస్ర మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఆయుర్వేద వైధ్యులు డాక్టర్. కళ్యాణపు హరికృష్ణ , యోగా గురుజీలు, కంపౌండర్లు, ఆయుర్వేద వైధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..
నందిగామ లో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
RELATED ARTICLES



