ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
నందిగామ పట్టణ నూతన మున్సిపల్ కమీషనర్ హేమామాలిని గారికి శుభాకాంక్షలు తెలియజేసిన జనసైనికులు
ఇటీవల నందిగామ పట్టణమునకు మున్సిపల్ కమీషనర్ గా విధులు నిర్వహించడానికి నియమితులైన శ్రీమతి హేమ మాలిని గారిని పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు
అనంతరం పట్టణంలోని ప్రజలు పడుతున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తేవడం జరిగింది. పట్టణంలో భాగమైన అనాసాగరం ప్రజలు పట్టణ ప్రజలతో సమానంగా పన్నులు చెల్లిస్తున్నా నందిగామ టిక్కెట్ పై ఎక్స్ప్రెస్ బస్సు రవాణా సౌకర్యం కల్పించడం లేదని గత కమీషనర్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని, జగ్గయ్యపేట RTC డిపో మేనేజర్, విజయవాడ* *RMO , నందిగామ MRO గార్లకు పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యమని తెలుపగా వారు త్వరితగతిన వాకబు చేసి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అదే విధంగా హైవే నిర్మాణం లో భూములు కోల్పోయిన వారికి ఇంతవరకు వారికి నష్ట పరిహారం రాలేదని తెలుపగా పై అధికారులకు విషయాన్నీ చేరవేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 20 వ వార్డు కౌన్సిల్ సభ్యులు తాటి వెంకట కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు శివకృష్ణ,వీర మహిళా విభాగం* *నాయకురాలు మేకపోతుల శ్రీలక్ష్మి యాదవ్, ఉపాధ్యక్షులు కొమ్మవరపు స్వామి, శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తెప్పలి కోటేశ్వర రావు, రామిశెట్టి లక్ష్మణ రావు,ఆకుల వెంకట్ ,వంశీ కృష్ణ, సూర్య,గోపాల్, నల్లగొండ శ్రీనివాస్, నరేంద్ర నాయకులు పూజారి రాజేష్ లు పాల్గొన్నారు…..
నందిగామ: మున్సిపల్ కమీషనర్ హేమామాలినికి శుభాకాంక్షలు తెలియజేసిన జనసైనికులు
RELATED ARTICLES