యన్టీఆర్ జిల్ల నందిగామ
బౌద్ధ కొండ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు
ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తల డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామం పరిధి లో గల గట్టు మూల వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బౌద్ధ కొండ పక్కన యన్టీఆర్ కాలనీ పక్కన గుమ్మడిదుర్రు గ్రామం వెళ్ళే రోడ్డు లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జె.సిబి.సహాయం తో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల తో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం నుండి పట్ట పగలు రామిరెడ్డిపల్లి గ్రామాని కి మట్టి రవాణ చేస్తున్నారు . అధికారులు కళ్ళు గప్పి ఈ అక్రమ మట్టి రవాణ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడం వల్లనే బౌద్ద కొండ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే అక్రమ మట్టి తవ్వకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని సంబంధించిన ప్రాంతంలో అక్రమ తవ్వకాలు నిర్వహించ కూడదని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు సంబందిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
నందిగామ బౌద్ధ కొండ వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు
RELATED ARTICLES