TEJA NEWS TV : ఫొటో జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి* జర్నలిస్టుల డిమాండ్ నందిగామ
ఆర్ డి ఓకు వినతి
*నందిగామ*
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కవరేజీకి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకష్ణపై దాడి చేసిన వైసిపి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నందిగామ ఆర్ డి ఓ కు
జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టు సంఘాల నాయకులు
మాట్లాడుతూ రాప్తాడులో ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి తీరును ఆయనకు వివరించారు. అనంతరం ఫొటో జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే చట్టబద్ధమైన రక్షణ లాంటి పద్ధతిని విధి నిర్వహణలో ఉండే వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ఆకుల వెంకట నారాయణ, జర్నలిస్టులు పఠాన్ మీరా హుస్సేన్, రాజేష్, సుభాష్, సత్య నారాయణ, సురేష్, ఇక్బాల్, మహేష్, వెంకట రెడ్డి, సీతా రామ్రామ్, ఇక్బాల్, కాకాని వెంకటేశ్వర రావు , సైదా ఖాన్, అనంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ: ఫొటో జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES