Wednesday, March 19, 2025

నందిగామ ప్రజల భద్రతే లక్ష్యంగా ఆటోలకు నెంబర్ల ఏర్పాటు

TEJA NEWS TV

సామాన్య ప్రజల భద్రతే లక్ష్యంగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు నందిగామ జోన్ డి.సి.పి. శ్రీ కంచి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఎసిపి శ్రీ వి.వి.నాయుడు గారి ఆధ్వర్యంలో నందిగామ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ జే.ఆర్.కే.హనీష్ గారు, ఆర్.ఎస్.ఐ.నరేష్ గారు, వారి సిబ్బందితో కలిసి నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరిగే ఆటోలకు ఎన్యుమరేషన్ ద్వారా నెంబర్లను కేటాయించడం జరిగింది.

ఈ సందర్భంలో ఇన్స్పెక్టర్ హనీష్ గారు మాట్లాడుతూ…. నందిగామ టౌన్ పరిధిలొ తిరిగే ఆటోలు మరియు ఆటో డ్రైవర్ల పూర్తి వివరాలను సేకరించి వారికి ఒక నెంబర్ ను కేటాయించడం జరుగుతుంది. దీని వలన ఎవరైనా ప్రజలు ఆటో లో ప్రయాణం చేయు సమయంలో ఏదైనా వస్తువులను ఆటోలలో మరిచిపోయినా, నేరం జరిగినా లేదా ఏదైనా ప్రమాదం జరిగిన సదరు  ఆటో యొక్క పూర్తి నెంబర్ గుర్తు పెట్టుకోలెని సందర్భంలో కేవలం ఆటోకి కేటాయించిన నెంబర్ చెప్పిన వెంటనే పోలీస్ వారివద్ద వున్న సమాచారంతో త్వరితగత్తిన సమస్యను పరిష్కరిచడం జరుగుతుంది.

అంతేకాకుండా ఆటో డ్రైవర్లు కూడా   వారి పూర్తి సమాచారం ప్రయాణికులకు తెలుస్తుందనే భావనతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.     ప్రయాణికులు ఈ నెంబర్ ను గుర్తుపెట్టుకోవడం వలన త్వరితగత్తిన సమాష్యను పరిష్కరిచడం జరుగుతుంది అని తెలియజేసినారు.

ఇప్పటి వరకు సుమారు 600 ఆటోలకు నేంబర్లను కేటాయించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లు ఎన్యుమరేషన్ చేయించు కోకుంటే వెంటనే రెండు రోజులలో వారి వివరాలను పోలీస్ స్టేషన్ నందు సమర్పించి నెంబర్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది.

త్వరలో నందిగామ పరిధిలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించు వారికి ట్రాఫిక్ రూల్స్ మరియు భద్రత్తలపై అవగాహన కల్పిస్తూ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  ఇన్స్పెక్టర్  గారితో పాటు, ఆర్.ఎస్.ఐ. నరేష్ గారు, సిబ్బంది మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular