TENA NEWS TV:ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
నియోజకవర్గంలో రంగా జయంతి వేడుకలు రాధా- రంగా మిత్ర మండలి, రంగా యువసేన కే పరిమితం….
కంచికచర్ల గత ప్రభుత్వ హయాంలో వంగవీటి మోహనరంగా జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహించి కంచికచర్ల నడిబొడ్డున వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటు చేస్తామన్న నాయకులు నేడు రంగా జయంతి వేడుకలలో ఎక్కడ కనిపించకపోవడంతో చర్చానియంశం గా మారింది.
వంగవీటి మోహనరంగా పేరున పట్టణంలో కళ్యాణమండపం నిర్మిస్తామన్న గత నాయకులు ,నేడు కనీసం ఆయన చిత్రపటానికి కూడా పూలమాలను వేకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేసింది.
విపక్ష నాయకులు రంగాను తమ తమ పార్టీలకు అన్వయించుకున్నారు.
రంగా బడుగు ,బలహీన వర్గాలకు, ఆశాజ్యోతి అన్న విషయం మర్చిపోయారు. అధికారం పోయి పట్టుమని నెల రోజులు కూడా గడవలేదు .అప్పుడే గత ప్రభుత్వ పార్టీ పెద్దలు ,నాయకులు వంగవీటి మోహన రంగాను విస్మరించటంపై నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం ఉంటే వంగవీటి మోహన రంగా తమ ఆరాధ్య దైవం అని, ఆయన తమ అందరి గుండెల్లో చిరస్మరణీయడంటూ బాకాలు ఊది ,తమ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. గురువారం వంగవీటి మోహన రంగా 77వ జయంతి ఉత్సవాలలో అధికార పార్టీ నాయకులు, రాధా రంగా మిత్రమండలి, రంగా యువసేన, జనసేన పార్టీ నాయకులు తప్ప గత ప్రభుత్వ నాయకుల ఆనవాలు ఎక్కడ కనిపించకపోవడంపై బహిరంగంగా చర్చ కొనసాగుతుంది.