TEJA NEWS TV
యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని రైతు పేట నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు మాస్టర్ – చెఫ్ కాంపిటీషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల అందరూ వివిధ రకాల వంటకాలను తయారు చేసారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ కుమార స్వామి మాట్లాడుతు ఈ మాస్టర్ చెఫ్ కాంపిటీషన్ ద్వారా విద్యార్థులు తమ తమ ఇంటినందు తయారు చేసి తీసుకోవచ్చిన వివిధ రకాల వంటకాలను, వెజ్ & నాన్ వెజ్ వంటకాలను అందిస్తున్నారు.
పిల్లల కోసం మాస్టర్ చెఫ్ పోటీ మా చిన్న చెఫ్‌లకు మాయా మరియు మంత్రముగ్ధులను చేసే అనుభవంగా ఆవిష్కరించబడింది.
ఈ సంతోషకరమైన ఈవెంట్ విద్యార్థులకు వంటగదిలోని అద్భుతాలను పరిచయం చేస్తుందని, విద్యార్థుల యొక్క ఆనందం, ప్రయత్నం మరియు ఊహను పెంపొందించడం, ఆహారం పట్ల ప్రేమను కలిగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం .హరీష్, ఆర్ ఐ .పవన్ కుమార్, రోజా రాణి, డీన్. స్వప్న , అకడమిక్ డీన్. టీ .నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ ముంతాజ్, మరియు హారిక, ఏ. ఓ .మహేష్ మరియు తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు….
నందిగామ: నారాయణ ఈ టెక్నో స్కూల్ లో మాస్టర్ చెఫ్ కార్యక్రమం
RELATED ARTICLES