ఎ
న్టీఆర్ జిల్లా నందిగామ రైతు పేట లో నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ప్రిన్సిపల్ కుమారస్వామి ఆధ్వర్యంలో యోగ గురుజి సీతారాం విద్యార్థులకు యోగ నేర్పించారు.
యోగా గురువు సీతారాం మాట్లాడుతూ
సాధన ద్వారా యోగా వస్తుంది, యోగా ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ప్రేమ వస్తుంది, ప్రేమ ద్వారా ఆనందం వస్తుందని తెలిపారు.
అనంతరం ప్రిన్సిపల్ కుమారస్వామి మాట్లాడుతూ
యోగ విద్యార్థులకు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉంచుతుంది. ఇది పిల్లలను పట్టుదలతో, ఓపికగా మరియు వారి లక్ష్యాల కోసం పని చేయడానికి నేర్పుతుంది. ఇది కరుణ, సంపూర్ణత, దాతృత్వం, దృష్టి, బలం మరియు వశ్యతను అభ్యసించడానికి సాధనాలను కూడా అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగా గురుజి గాడి పరిస్థితి సీతారాం , ఏజియం.హరీష్ , ఆర్.ఐ.పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి,ఏఓ.మహేష్ , మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.