ఎన్టీఆర్ జిల్లా, నందిగామ ఐతవరం గ్రామం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. నందిగామ నియోజకవర్గం ఐతవరం వద్ద జాతీయ రహదారి పై మున్నేరు వాగు పొంగడంతో రెండు రోజులు జాతీయ రహదారి దిగ్బంధం జరిగిన విషయం తెలిసిందే. కాగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బుధవారం నాడు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఐతవరం జాతీయ రహదారి వద్ద జరుగుతున్న మార్జిన్ పనులను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసిందన్నారు. నష్టపరిహారం తదితర కార్యక్రమాలతో పాటు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు కూటమి ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు…..
నందిగామ :జాతీయ రహదారి వద్ద జరుగుతున్న మార్జిన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES