TEJA NEWS TV : యన్టీఆర్ జిల్లా నందిగామ
జయ సిద్ధార్థ హై స్కూల్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు*
బాలోత్సవం కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థి ని విద్యార్ధులు
యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని జయ సిద్దార్ధ హై స్కూల్ నందు శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
పిల్లలకు జీసస్, మేరీ మాత, క్రిస్మస్ తాత శాంటా, వేషధారణలు వేయించినారు.
పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క వేడుకలను జరుపుకున్నారు.
స్కూల్ ప్రిన్సిపల్ పి. విజయలక్ష్మి మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననం గురించి పశువుల పాకలో జన్మించినటువంటి ఏసుక్రీస్తును గొర్రెల కాపరులు చూచుట ఏసుక్రీస్తు జన్మదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న క్రిస్మస్ పండుగను సోదర సోదరీమణులు ఏ విధంగా జరుపుకుంటారని తెలిపారు.
అనంతరం విజయవాడలో జరిగిన అమరావతి బాలోత్సవం కార్యక్రమంలో పి .ఆఫీయ అంజూమ్ బెస్ట్ ఫ్రం వేస్ట్ విభాగంలో ప్రశంసా పత్రం అందుకుంది.
జయ సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి , కరస్పాండెంట్ పి. రామ్మోహన్ అభినందించారు.
నందిగామ :జయ సిద్ధార్థ హై స్కూల్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు
RELATED ARTICLES