Friday, January 24, 2025

నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకను పురస్కరించుకొని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త  తంబళ్ళపల్లి రమాదేవి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.
అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణంలోనూ, ఒక న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, అట్టడుగు స్థాయి నుండి ఎవరూ  అందుకోలేని విధంగా,  ప్రపంచ దేశాలు కీర్తించే విధంగా, బి.ఆర్. అంబేద్కర్  గారి జీవనశైలి ఉన్నదని,  ఆయన పౌరులకు ప్రసాదించిన గొప్ప వరం ఓటు అని,  ఓటు ద్వారా తమ భవిష్యత్తును తామే రాసుకునే విధంగా.. ఈ భారత దేశ ప్రజలకు ఆయన అందించారని, అదేవిధంగా ఆయన భారత ప్రభుత్వం పట్ల పనిచేసిన తీరు అమోఘమని, గొప్ప గొప్ప సంస్కరణలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, ఈరోజు ఆయనను స్మరించుకొనుట ప్రతి భారతీయుడి అదృష్టమని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి గురించి శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు వ్యాఖ్యానించారు.

అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ప్రతి ఒక్కరు పుణికిపుచ్చుకోవాలని అట్టడుగు స్థాయి నుంచి అభ్యున్నత స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలని.. మనమందరం ఆయన అడుగుజాడల్లో రాజ్యాంగబద్ధంగా నడవాలని ఆవిడ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో  తంబళ్ళపల్లి రమాదేవి గారితో పాటు నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, మరియు టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, వీర మహిళలు, మరియు జన సైనికులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular