ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అభినందనలు తెలిపేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పొటెత్తారు. శుక్రవారం కాకానీ నగర్ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తంగిరాల సౌమ్యకు శుభాకాంక్షలు తెలియజేసారు
నియోజకవర్గ, మండల అధికారుల మర్యాదపూర్వక కలయిక, శుభాకాంక్షలు
శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్యను నియోజకవర్గ మరియు మండలాలకు చెందిన ముఖ్య విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రధానంగా నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, డీఎస్పీ రవికిరణ్, సీఐ హనీష్, నాగేంద్ర కుమార్, ఎస్సై ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ హేమా మాలిని, ఎన్టీఆర్ జిల్లా డ్వామా పీడీ సునీత, దేవాదాయ ధర్మాదాయ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమీషనర్ కె. శాంతి, తహశీల్దార్లు, జలవనరుల శాఖ అధికారులు, అంగన్ వాడీ ఉద్యోగులు పలు శాఖల ఉద్యోగులు తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అభినందన వెల్లువ
RELATED ARTICLES