TEJA NEWS TV : నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నందిగామ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని యూనియన్ అధ్యక్షులు తురక రామస్వామి గౌరవ అధ్యక్షులు షేక్ పితాన్ మేస్త్రి మరియు జగ్గయ్యపేట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తదితర బిల్డింగ్ వర్కర్స్ నాయకులు కార్మికులు ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి,ప్రముఖ న్యాయవాది,యూనియన్ న్యాయ సలహాదారులు షేక్ కరీముల్లా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, కార్యదర్సి లక్ష్మీనారాయణ,13వ వార్డు కౌన్సిలర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామ ఎమ్మెల్యే కు ఘన సన్మానం
RELATED ARTICLES