ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ
*కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు… రూరల్ సీఐ చంద్రశేఖర రావు…*
*జిల్లాలో 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది…*
*బాణాసంచా కాల్చడం, బైక్ ర్యాలీలువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు…*
*హద్దు దాటితే పట్టణ చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించిన సిఐ…*
విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఆదేశాల మేరకు ఏసిపి డాక్టర్ రవి కిరణ్ సారథ్యంలో కంచికచర్ల మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అన్ని పార్టీల మండల గ్రామ స్థాయి నాయకులతో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నందిగామ రూరల్ సీఐ చంద్రశేఖర రావు కంచికచర్ల ఎస్ఐ సుబ్రహ్మణ్యం అవగాహన కార్యక్రమం నిర్వహించారు…
ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖరరావు మాట్లాడుతూ:
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినందుకు పోలీసు వారికి సహకరించిన మండలంలోని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు…
జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవని ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సభలు సమావేశాలు విజయోత్స ర్యాలీలకు అనుమతులు లేవు…
హద్దు మీరితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కాబట్టి మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు…
అనంతరం కంచికచర్ల ఎస్సై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ:
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియా గ్రూపులతో పాటు వివిధ సామాజిక మాధ్యమాలపై పోలీస్ నిఘా ఉంటుందని రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని అన్నారు…
ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా మండల ప్రజలు ఎలా సహకరించారో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా అలాగే ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు…
నిబంధనలను అతిక్రమించిన వారిపై బైండవర్ కేసులతో పాటు సీట్ ఓపెన్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు…
నందిగామ :ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల వారు నిబద్దత పాటించాలి – సీఐ
RELATED ARTICLES