సమాన పనికి సమాన వేతనం, జీతాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే సౌమ్యకు ఆశ వర్కర్ల వినతి
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆశా వర్కర్లకు విడుదల చేయాల్సిన ఒప్పందాల జీఓలు తాత్కాలికంగా నిలుపుదల చేయగా, జీఓలు, సర్యులర్స్ వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలరని నందిగామ నియోజకవర్గ ఆశా వర్కర్లు ఎమ్మెల్యే తంగిరాల సామ్యకు వినతి పత్రం అందజేసారు. వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, అదనపు పనులు చేయించరాదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారిని ఆశా వర్కర్లుగా తీసుకోవాలని, మట్టి ఖర్చులకు రూ.20,000/-లు చెల్లించాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సాధారణ శెలవులు, మెటర్నటీ లీవ్లు, మెడికల్ లీవులు కల్పించాలని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు సచివాలయం వెల్ నెస్ సెంటర్లలో బలవంతంగా కూర్చోపెట్టడం వెంటనే ఆపాలని, ఆశా వర్కర్లతో సెంటర్స్ క్లీనింగ్ చేయించరాదని, నాణ్యమైన సెల్ఫోన్లు ఇవ్వాలని, అప్పటివరకు సొంత ఫోన్లో యాప్సు డౌన్లోడ్ చేసుకొని పని చేయాలనే అధికారులు ఒత్తిడిని ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేసారు. దీనిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందిస్తూ వారి డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతాని వారికి తెలిపారు. కాగా, వర్కర్లు ఎమ్మెల్యే స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేసారు.