NTR జిల్లా / నందిగామ టౌన్ :
ది.24-01-2024(బుధవారం) ..
*నియోజకవర్గ స్థాయి “ఆడుదాం ఆంధ్రా” క్రీడా పోటీలను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..*
*ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో “ఆడుదాం ఆంధ్రా” నిర్వహణ : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..*
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Z.P.H.S) లో నిర్వహిస్తున్న నియోజకవర్గం ఆడుదాం ఆంధ్రా పోటీలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని.. కొద్దిసేపు వాలీబాల్ మ్యాచ్ ను వీక్షించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి వారికి ఉజ్వల భవిష్యత్ అందించే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితంలో దేహదారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటి చెప్పడంతో పాటు.. ప్రతిభగల క్రీడాకారులను ఉన్నత వేదికలకు పరిచయం చేసేలా టోర్నీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే గ్రామస్థాయి, మండల స్థాయి పోటీలు పూర్తయి.. నియోజకవర్గస్థాయిలో పోటీలు జరుగుతున్నాయని.. అనంతరం జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని.. విజేతలైన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏఈ, వైస్ చైర్మన్, పలు పాఠశాలల పీఈటీలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు ..
నందిగామ: “ఆడుదాం ఆంధ్రా” క్రీడా పోటీలను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
RELATED ARTICLES