

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
జనసేన పార్టీ జెండా స్థూప నిర్మాణ శంకుస్థాపన*
ప్రతి గ్రామాన జనసేన పార్టీ దిమ్మె నిర్మాణమే మా లక్ష్యం
ముఖ్య అతిథిగా వచ్చిన నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ప్రతి గ్రామాన జనసేన జెండా దిమ్మ మా లక్ష్యమని ఈరోజు అనాసాగరం గ్రామంలో జనసేన దిమ్మె భూమి పూజ కార్యక్రమం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అనాసాగరం గ్రామంలో జనసేన దిమ్మె ఎప్పటినుంచో నిర్మించాలని ఒక కల అని ఆ కల కు ఈరోజు శంకుస్థాపన జరిగిందని ఆమె తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో కీలక పాత్ర వహించినటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ యొక్క గౌరవ చిహ్నం అని, ఈ జనసేన జెండా దిమ్మె ఒక గౌరవ ప్రతీక ఆమె తెలిపారు జనసేనని పవన్ కళ్యాణ్ మీద ఎంత గౌరవం ఉందో ఈ జనసేన జెండా దిమ్మె ను కూడా అంతే గౌరవిస్తామని సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి తెలియజేశారు.*
*ఈ కార్యక్రమాన్ని అనాసాగరం గ్రామ ప్రజలు గుండాల బాలాజీ సహకారంతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ,చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెల్లి సుధాకర్,మెల్లంపూడి గోపి(పీఆర్పీ),నల్లగొండ మురళి కృష్ణ,తాటి ఫణింద్ర,రామిరెడ్డి రమేష్,యర్రబడి సురేష్,పుప్పాల భారత్ సాయి,సూర సత్యనారాయణ,కొమ్మినిడి సత్యనారాయణ,వీరమహిళలు కొట్టె వెంకటనరసమ్మ,కరి అనురాధ,కోమలి, గ్రామ పెద్దలు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.*



